ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయాలి
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలను విరమించి, కార్మికుల హక్కులను పరిరక్షించాలి అని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట్ రాములు అన్నారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఉపాధి హామీ హక్కుల వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ పేదలకు ఉపాధి, ఆదాయ భద్రత కల్పించడంలో ఉపాధి హామీ చట్టం కీలక పాత్ర పోషించిందన్నారు. కొత్తగా ప్రతిపాదించిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ (గ్రామీణ్)' వల్ల ఉపాధి హామీ పథకం బలహీనపడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త విధానం అమలైతే నిధులు, పనిదినాలు తగ్గి గ్రామీణ కార్మికుల జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించి, కార్మికుల పనిహక్కును పరిరక్షించాలని డిమాండ్ చేశారు. రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఎదుట ఉపాధి హామీ హక్కుల వేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో: దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ జాతీయ ప్రజా ఉద్యమాల వేదిక నాయకురాలు మీరా సంఘమిత్ర అమ్సోల్ లక్ష్మణ్ పద్మ శోభన్ కల్పన రాజేష్ శారద నవీన్ ఆంజనేయులు పాల్గొన్నారు.