పాము కాటుతో మహిళ మృతి

పాము కాటుతో మహిళ మృతి

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామానికి చెందిన సుర్వి పద్మ (58)  తన గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంది. మంగళవారం సుమారు సాయంత్రం 04.00 గంటల సమయంలో ఉతికిన బట్టలను తన ఇంటి వెనుకాల ఉన్న ఖాళి స్థలంలో ఉన్న సెంట్రింగ్ చెక్కలపై అరవేస్తుండగా అదే సమయంలో ఒక గుర్తు తెలియని పాము ఎడమ కాలు మడమపై కాటు వేయడంతో ఆమెను రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం  తరలించిగా అక్కడ చికిత్స అనంతరం ఆమెను మెరుగైన చికిత్స కోసం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ కు సాయంత్రం సుమారు 06.00 గంటల సమయంలో తరలించి, అక్కడ పరీక్షించగా అప్పటికే మరణించిందని నిర్దారించినారని మృతురాలి తమ్ముడు సుర్వి అశోక్ రామన్నపేట మండల పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడే కేసు నమోదు చేసి బుధవారం రోజు శవ పంచనామా చేశారు. మృత దేహాన్ని మృతురాలి కుటుంబానికి అప్పగించి దర్యాప్తు చేస్తున్నామని రామన్నపేట ఎస్సై డి.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/woman-dies-of-snake-bite/article-17688

Tags: