గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు మోహన్ నాయక్ కు ఘన సన్మానం

విశ్వంభర, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి చెందిన నునావత్ మోహన్ నాయక్ ఇటీవల గిరిజన మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో బుధవారం బిజెపి మండల పార్టీ అధ్యక్షులు సంపత్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నునావత్ మోహన్ నాయక్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని తెలిపారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమంతో పాటు జిల్లాలో గిరిజన మోర్చాను బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. తమపై విశ్వాసంతో ఈ అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ తదితర నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొల్లి సుధాకర్,  మైసమ్మ వాగు తండా ఉపసర్పంచ్  బిజెపి గ్రామ శాఖ అధ్యక్షుడు మాలోత్ రాజేందర్, మాలోత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tribular-morcha-district-president-mohan-naik-was-honored/article-17666

Tags: