భూభారతి భూ రీసర్వేలకు రైతులు సహకరించాలి
- తహసీల్దార్ శ్రీనివాసులు
విశ్వంభర, ఇనుగుర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి భూ సర్వేలకు సహకరించాలని తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు రైతులను కోరారు. ఇనుగుర్తి మండలం లో పైలెట్ ప్రాజెక్టు కింద కోమటిపల్లి గ్రామం ఎంపిక కాగా రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సర్పంచ్ మద్దెల బిక్షపతి గౌడ్ అధ్యక్షతన బుధవారం తెలంగాణ భూభారతి భూముల రీ సర్వే పై గ్రామసభ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.దీనికి తహసిల్దార్ శ్రీనివాసులు హాజరై మాట్లాడుతూ భూభారతి సర్వేలో మొదట గ్రామ సరిహద్దులు,అనంతరం ప్రభుత్వ భూములు,చెరువు శిఖాలు మొదలైనవి గుర్తిస్తారన్నారు. గ్రామంలో ఏరియాల వారీగా అధికారులు చాటింపు చేసి సర్వే చేస్తారని ఆ ఏరియా కు సంబంధించిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇకనుంచి ఒక్కో రైతుకు ఒక్కో సర్వే నెంబర్ కేటాయిస్తారని బై నెంబర్లు ఉండవని తెలిపారు. సభలో మ్యాపులున్నవికరణ,సరిహద్దుల గుర్తింపు,ప్రభుత్వ భూముల రక్షణ,పహనీల రికార్డులు,పట్టాదారుల భాగస్వామ్యం,వివాదాల పరిష్కారం,సాంకేతికత వినియోగం, అప్పీలు చేసుకునే అవకాశం వంటి అంశాలను చర్చించారు.కార్యక్రమంలో పాత తండా సర్పంచి ఇస్లావత్ నరేష్,తారా సింగ్ తండా సర్పంచి నూనావతు బద్రు నాయక్, సర్వేయర్ భాష్మియా, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కూరెల్లి సతీష్,జిపిఓ శేఖర్ రైతులు గ్రామస్తులు పాల్గొన్నారు.