వీబీ గ్రామ్‌జీ–2025 ను  రద్దు చేయాలి

వీబీ గ్రామ్‌జీ–2025 ను  రద్దు చేయాలి

విశ్వంభర, చిక్కడపల్లి : వీబీ గ్రామ్‌జీ–2025ను రద్దు చేసి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలి అని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య డిమాండ్ చేశారు. ఎన్‌పీఆర్‌డీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాదు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ వద్ద నల్లజెండాలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎం. అడివయ్య మాట్లాడుతూ వీబీ గ్రామ్‌జీ–2025 అమలుతో గ్రామీణ ప్రాంత వికలాంగుల ఉపాధి అవకాశాలు తగ్గుతాయని అన్నారు. వికలాంగులకు 200 రోజుల ఉపాధి కల్పించి, రోజువారీ కూలీని రూ.800కు పెంచాలని డిమాండ్ చేశారు. వీబీ గ్రామ్‌జీ–2025ను రద్దు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో: ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కె. వెంకట్ కోశాధికారి ఆర్. వెంకటేష్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎస్. రాజు గ్రేటర్ హైదరాబాద్ నాయకులు నర్సింగ్ రవి సత్యయ్య పాల్గొన్నారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/vb-gramji-2025-should-be-cancelled/article-17626

Tags: