సర్ పై సందేహాల నివృత్తికి రాజకీయ పార్టీలతో జిల్లా కలెక్టర్ సమావేశం

విశ్వంభర, మహబూబాబాద్: బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని వి.సి. హాలులో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం  అమలుపై వివిధ రాజకీయ పార్టీలకు ఉన్న సందేహాలను నివృత్తి చేసేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్నేహ శబరిష్ అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సర్  కార్యక్రమం షెడ్యూల్, ఇంటింటి సర్వే, ఫారాల స్వీకరణ, క్లెయిమ్స్ , అబ్జెక్షన్ల ప్రక్రియపై పార్టీల నాయకులు లేవనెత్తిన అంశాలకు కలెక్టర్ సవివరంగా సమాధానం ఇచ్చారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన ప్రక్రియ విజయవంతం కావడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ సహకరించాలని కోరారు.  2002 ఓటర్ల జాబితా ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాలను ధృవీకరించి నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలో వివరించే ట్యుటోరియల్ వీడియోలను సిద్ధం చేశామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి సందేహానికి సమాధానం ఇవ్వబడుతుందని తెలిపారు. దోషరహిత ఓటరు జాబితా రూపకల్పనకు అన్ని రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి. సందేహాలుంటే నేరుగా నా దృష్టికి గానీ, ఈ ఆర్ ఓ  దృష్టికి గానీ తీసుకురావాలి" అని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో రెవెన్యు అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్, పరిపాలన అధికారి పవన్ కుమార్,  భారతీయ జనతా పార్టీ నుండి వేముల కోమల్ వెంకట్ రెడ్డి, శ్యాం సుందర్ శర్మ, సీతారాం నాయక్, కాంగ్రెస్ పార్టీ నుండి సురేష్ నాయుడు, బి.ఆర్.ఎస్ పార్టీ నుండి మార్నేని వెంకన్న, బి.ఎస్.పి పార్టీ నుండి విజయకాంత్, టి.డి.పి నుండి రామారావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/district-collectors-meeting-with-political-parties-to-clear-doubts-on/article-17690

Tags: