విద్యారంగ పరిరక్షణ కోసం జూన్ 5న ఛలో హైదరాబాద్

  • హుస్నాబాద్ జోన్ డీటీఎఫ్ పిలుపు

విశ్వంభర, హుస్నాబాద్:  విద్యా రంగ పరిరక్షణ కోసం జూన్ 5న హైదరాబాద్‌లో నిర్వహించనున్న “ఛలో హైదరాబాద్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలో డీటీఎఫ్ హుస్నాబాద్ జోన్ ఆధ్వర్యంలో సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు జరగనున్న ర్యాలీ, ధర్నాకు సంబంధించిన పోస్టర్ మరియు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. విద్యా రంగ సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం ఈ ఉద్యమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. తిరుపతి రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్లు వి. వెంకటరమణరెడ్డి, గడ్డం లక్ష్మారెడ్డి, హుస్నాబాద్ మరియు అక్కన్నపేట మండలాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు బి. ప్రభాకర్ రెడ్డి, ఎ. మల్లయ్య, డీటీఎఫ్ సీనియర్ నాయకులు ఎల్. రాజిరెడ్డి, ఎ. రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/chalo-hyderabad-on-june-5-for-the-protection-of-education/article-16155

Tags: