విగ్నేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలి: టీఎన్జీవో ఉపాధ్యక్షులు చిలుక నరసింహా రెడ్డి.

విగ్నేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలి: టీఎన్జీవో ఉపాధ్యక్షులు చిలుక నరసింహా రెడ్డి.

విశ్వంభర, సరూర్ నగర్ :- విగ్నేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలి అని  టీఎన్జీవో ఉపాధ్యక్షులు చిలుక నరసింహా రెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ పరిధిలోని వాసవి కాలనీ నివాసుల సంక్షేమ సంఘము అధ్యక్షుడు గౌరీశెట్టి చంద్రశేఖర్ గుప్త ఆధ్వర్యంలో మహా గణపతి 38వ నవరాత్రి మహోత్సవాల లో భాగంగా తొమ్మిదవ రోజు నిర్వహించిన పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా టీఎన్జీవో ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం చిలుక నరసింహా రెడ్డి హాజరై   ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారికి బహుమతులను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో వాసవి కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అయిత అంజయ్య,  సుధాకర్ గుప్తా, చిలుక ఉపేందర్ రెడ్డి, బంధం దామోదర్ గుప్తా,  బచ్చు ప్రభాకర్,  వెంపటి కృష్ణమోహన్, గౌరిశెట్టి శ్రీనివాస్, అరుణ్ కుమార్, వనమా సుదర్శన్, గ్రంథి రమేష్, మాలే అనిల్,  శ్రీధర్, భరద్వాజ్, దండు రాజు,  వినోద్ కుమార్, గౌరీ శంకర్, సత్యనారాయణ, మాలే శ్రీనివాస్, శుభకర్, కృష్ణ మూర్తి, రామ స్వామి, మేఘమాల, భ్రమరాంబ, గోలి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags: