యువ ఆపద మిత్రులతో సమాజానికి భరోసా
On
విశ్వంభర, హైదరాబాదు: ప్రకృతి వైపరీత్యాల సమయంలో యువ ఆపద మిత్రులు కీలక పాత్ర పోషించాలని హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య అన్నారు. బుధవారం నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో స్థానికంగా ఉండే యువకులే ముందుండి సహాయం అందించాలని సూచించారు. ఫిబ్రవరి 18 నుంచి 24 వరకు జరుగుతున్న మూడవ బ్యాచ్ శిక్షణలో ఆపద సమయంలో స్పందించే విధానం, ప్రాణరక్షణ, ప్రాథమిక చికిత్స వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాలకు చెందిన 105 మంది యువ వాలంటీర్లు ఫతుల్‌గూడలోని హైడ్రా శిక్షణ కేంద్రంలో పాల్గొంటున్నారు.



