వైకాపా అసత్య ప్రచారాలు 

వైకాపా అసత్య ప్రచారాలు 

విశ్వంభర,  రాప్తాడు: రాప్తాడు మండల కేంద్రంలో పండమేటి వెంకటరమణ స్వామి దేవాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ, టీటీడీలో నెయ్యి  కల్తీ  జరగలేదని  వైకాపా నాయకులు సిబిఐ కోర్టు తేల్చిందని అబద్ధాలు చెబుతూ  ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. నిన్న మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి  రాప్తాడు లో  వెంకటరమణ స్వామి  దేవాలయంలో  పూజలు చేసి  సిబిఐ కోర్టు టీటీడీలో నెయ్యి  కల్తీ  జరగలేదని తీర్పు ఇచ్చిందని అబద్ధాలు చెప్పారన్నారు.  ఈ విషయాన్ని మండల తెదేపా నాయకులు  విలేకరుల సమావేశంలో ఖండించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పంపుకొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, సర్పంచ్ తిరుపాలు, మాజీ కన్వీనర్ నారాయణస్వామి, హిందూపురం పార్లమెంటు అధికార ప్రతినిధి పాలచర్ల ముత్యాలప్ప, హిందూపురం పార్లమెంటు జనరల్ సెక్రెటరీ బండమీద పల్లి వెంకటరాముడు, సొసైటీ అధ్యక్షుడు, మరోరు గోపాల్,  తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

Tags: