గాంధీజీ కలలను సాకారం చేద్దాం
- కాంగ్రెస్ నేత అశోక్ గౌడ్
విశ్వంభర, ఇనుగుర్తి: గాంధీజీ కలలుగన్న గ్రామాల అభివృద్ధి ,గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ మానుకోట జిల్లా కన్వీనర్ బైరు అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు. అహింసా మార్గం ద్వారా దేశానికి స్వాతంత్రం తీసుకు వచ్చిన గాంధీజీ మార్గం ప్రపంచానికి ఆదర్శమన్నారు. ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామపంచాయతీ లో గాంధీ వర్ధంతి పురస్కరించుకొని బాపూజీ చిత్రపటానికి ఉపసర్పంచి తుమ్మనపల్లి సతీష్ చారి, జి పి కార్యదర్శి గండు అనిల్ కుమార్,చెడు పాక యాకయ్య తదితరులతో కలిసి పూలమాలలువేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో గాంధీజీ పాత్ర ఎనలేనిదని కొనియాడారు.పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బైరు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ , మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రజాప్రతినిధులు,నాయకులు,సమాజం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బైరు వెంకటేశ్వర్లు గౌడ్,నిడిగంటి చంద్రమౌళి,నాయకులు గుర్రం వెంకన్న గౌడ్, బింగి యాకయ్య గౌడ్,వరుదోలు యాకమ్మ తదితరులు పాల్గొన్నారు.



