కూటమి ప్రభుత్వంతోనే  అభివృద్ధి

కూటమి ప్రభుత్వంతోనే  అభివృద్ధి

విశ్వభర, రాప్తాడు: హిందూపురం పార్లమెంటు అధికార ప్రతినిధిగా తనను నియమించిన  ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్,  ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ , ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాలశ్రీరామ్, మండల ఇంచార్జ్ ధర్మవరపు మురళి లకు  పాలచర్ల ముత్యాలప్ప కృతజ్ఞతలు తెలిపారు. రాప్తాడు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన  సమావేశంలో ఆయన  మాట్లాడుతూ,  కూటమి ప్రభుత్వంపై కొందరు వైసీపీ నాయకులు దుష్ప్రచారాలు  చేస్తున్నారని వాటిని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారని అన్నారు.  కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు చెప్పిన హామీలన్నీ నెరవేర్చిందని చెప్పారు.  అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు  చెప్పిన విధంగానే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పెన్షన్ 7000 రూపాయలు ఇవ్వడం జరిగిందని,  అంతేకాకుండా ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు అందించామని  మిగిలిన పథకాలన్నీ కూడా రాష్ట్రం ప్రభుత్వం లోబడ్జెట్ లో ఉన్నప్పటికీ వీటిని ప్రజలకు అందజేశారని తెలిపారు. .
వీటి పైన వైసిపి నాయకులు  దుష్ప్రచారాలు మానుకోవాలని సూచించారు. నారా లోకేష్ బాబు యువగలం పాదయాత్రలో చెప్పిన విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కంపెనీలు తీసుకురావడం జరిగిందని ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగిందని, రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందని వీటీని చూసి ఓరువలేక  దుష్ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. 2029 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం సునామీ రాబోతుందని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే ప్రజలు ఇవ్వడం జరిగిందని అయినా వీరు భుజాలు ఎగరవేసుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

Tags: