‘మాకు కాదు.. ముందు మీరే నేర్చుకోండి’

ఏసీపీపై ఎంపీ అరవింద్ ఫైర్

‘మాకు కాదు.. ముందు మీరే నేర్చుకోండి’

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేడి నిజామాబాద్‌లో తారాస్థాయికి చేరింది. పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ నాయకులు, పోలీసుల మధ్య జరుగుతున్న పోరు ఓటర్లలో ఆసక్తి రేపుతోంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రంగంలోకి దిగడంతో వినాయక్ నగర్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేడి నిజామాబాద్‌లో తారాస్థాయికి చేరింది. పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ నాయకులు, పోలీసుల మధ్య జరుగుతున్న పోరు ఓటర్లలో ఆసక్తి రేపుతోంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రంగంలోకి దిగడంతో వినాయక్ నగర్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.


బూత్ నంబర్ 7 వద్ద విధుల్లో ఉన్న శంకర్ అనే కానిస్టేబుల్, ఒక మున్సిపల్ ఉద్యోగి కలిసి ఓటర్లను కాంగ్రెస్ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ అరవింద్‌కు ఫిర్యాదులు అందాయి. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన, పోలీసుల తీరుపై నిప్పులు చెరిగారు. అక్కడే ఉన్న ఏసీపీని నిలదీస్తూ.. "కానిస్టేబుల్ తప్పు చేస్తే అది మీరు చేసినట్లే లెక్క" అని హెచ్చరించారు. "మాకు నేర్పించడం కాదు.. ముందు మీరే పద్ధతులు నేర్చుకోండి" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి.

Read More చిర్ర సాత్విక్‌ను అభినందించిన ఆల్ఫోర్స్ చైర్మన్ డాక్టర్ వి. నరేందర్ రెడ్డి.

 
వినాయక్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో ఎంపీ అరవింద్ ప్రత్యర్థులపై ఫైర్ అయ్యారు. ఓట్ల కోసం కొందరు కుల రాజకీయాలు చేస్తున్నారని కార్యకర్తలు వివరించగా, ఆయన ఘాటుగా స్పందించారు. "కులాల పేరుతో విడగొట్టాలని చూస్తే ఒక్కటే అడగండి.. గతంలో కాశ్మీర్‌లో, ఇప్పుడు బంగ్లాదేశ్‌లో హిందువులను ఊచకోత కోసేటప్పుడు కులాలు చూశారా?" అని ప్రశ్నించారు. అక్కడ చంపింది హిందువులనే తప్ప కులాలను కాదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.