రోస్టర్ పాయింట్ మార్పునకు ఒత్తిడి తెస్తా

: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

విశ్వంభర, హైదరాబాదు : ఎస్సీ గ్రూప్–3లోని మాలలు, ఇతర 25 కులాలకు తొలి రోస్టర్ పాయింట్‌ను 22 నుంచి 16కు మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తానని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఆదివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో మాల ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నాలో పాల్గొని ఆయన ఈ మేరకు మాట్లాడారు. మాలల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న రోస్టర్ విధానాన్ని వెంటనే సవరించాలని మాల ప్రజాఫ్రంట్ చైర్మన్ డాక్టర్ మండాల లింగస్వామి డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలుతో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, రోస్టర్ విధానాన్ని సవరించి న్యాయం చేయాలని కోరారు. మాజీ మంత్రి సుద్దాల దేవయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానం వల్ల మాల విద్యార్థులు, నిరుద్యోగ యువత నష్టపోతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోస్టర్ పాయింట్లను సవరించాలని డిమాండ్ చేశారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజు ఉస్తాద్, మాల ప్రజాఫ్రంట్ వైస్ చైర్మన్ దాసరి విశాల్, కోఆర్డినేటర్లు మేసే నాందేవ్, అంజలి, మాల మహానాడు రాష్ట్ర చైర్మన్ మండాల భాస్కర్, గ్రేటర్ చైర్మన్ బేర బాలకిషన్, గౌరవ అధ్యక్షుడు చెరుకు రాంచందర్ మాట్లాడుతూ ఎస్సీ గ్రూప్–3లోని మాలలు, ఇతర 25 కులాలకు తొలి 50 రోస్టర్ పాయింట్లలో మూడు అవకాశాలు కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-roster-point-changes-pressure/article-18080

Tags: