జర్నలిస్టుల సమస్యల సాధన కోసం ఉద్యమం
విశ్వంభర, చిక్కడపల్లి : జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) యాక్టింగ్ అధ్యక్షుడు పిల్లి రాంచందర్, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య డిమాండ్ చేశారు. హైదరాబాదు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మాణాలు చేశారు. ఈనెల 13న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు చేపట్టి వినతిపత్రాలు అందజేయాలని, 15న రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. జర్నలిస్టులకు కొత్త హెల్త్ కార్డులు జారీ చేయాలని, ఇండ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని, అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని కోరారు. జర్నలిస్టులకు నెలకు రూ.10 వేల పెన్షన్, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో వారి పిల్లలకు వంద శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. జూలై నెలాఖరులోగా జిల్లా మహాసభలు, ఆగస్టు నెలాఖరులో రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం కన్వీనర్‌గా పిల్లి రాంచందర్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో: ఉపాధ్యక్షులు ఎల్గొయి ప్రభాకర్ తాటికొండ కృష్ణ మానిక్ ప్రభు గుడిగ రఘు రాజశేఖర్ కార్యదర్శులు సలీమ్ చంద్రశేఖర్ నవీన్ అరుణకుమార్ పాల్గొన్నారు.