ఐటి రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేసిన నాయకుడు కేటీఆర్- మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్
విశ్వంభర, ఆమనగల్లు, జూలై 24 : - ఆమనగల్లు మండలంలోని బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ తెలంగాణ రాష్ట్ర మాజీ ఐ టి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన ఆమనగల్ బస్టాండ్ లో కేక్ కట్ చేసి పండ్లు పంచిపెట్టారు ఈ సందర్బంగా ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ కేటీఆర్ మంత్రి గా ఉండి తెలంగాణ రాష్ట్రము లో ఐటి శాఖ మంత్రి గా ఉండి ప్రపంచంలోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నాయకుడని హైదరాబాద్ నగరాన్ని దేశంలో ప్రముఖ నగరాల్లో ఒకటిగా చేసిన ఘనత వారికే దక్కిందని ఐటి రంఘం లో రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా మలిచిన కేటీఆర్ సేవలు మరువ లేనివని తెలుపుతూ ఈలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని దేవుణ్ణి కోరుకుంటూ మా నియోజకవర్గ ప్రజాప్రతినిధుల, ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసిలు దశరథ్ నాయక్, అనురాధ, పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్, మాజీ ఎంపీపీ నిర్మల శ్రీశైలం బిఆర్ఎస్ నాయకులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్, బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్ గౌడ్, సీనియర్ నాయకులు గోపాల్ నాయక్ గణేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.