అంగరంగ వైభవంగా ఎల్లమ్మ తల్లి బోనాలు

అంగరంగ వైభవంగా ఎల్లమ్మ తల్లి బోనాలు

విశ్వంభర, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గల పూసల కులస్తులు అందరు కలిసి ఆదివారం  పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలతో యాట పిల్లలను పట్టుకుని కులస్తులందరూ కలిసి డప్పు, చప్పులతో, డీజే డ్యాన్సులతో అమ్మవారి పూనకాలతో తల్లి గుడికి చేరుకొని ఎల్లమ్మ తల్లికి బోనాలతో పాటు యాట పిల్లలను సమర్పించినారు.. ఆ రేణుక ఎల్లమ్మ తల్లి పూసల కులస్తులతో పాటు పట్టణంలోని ప్రజలందరూ చల్లగా ఉండాలని తల్లిని కోరుకున్నారు. అలాగే వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో ఈ ప్రాంతమంతా పచ్చని పంటలతో షష్యశ్యామలంగా ఉండాలని తల్లిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పూసల సంఘం అధ్యక్షులు గుంటిపల్లి ఆంజనేయులు పట్టణ సంఘం అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాస్, గూడెం పెద్ద గుంటుపల్లి సారయ్య జిల్లా ఉపాధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాస్ చీఫ్ అడ్వైజర్ ముద్రగోల నాగేందర్ జిల్లా సంయుక్త కార్యదర్శి చేని రామలు, ముధుర కోలా శ్యామల, భారీ ఎత్తున మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ellammas-mothers-bona-in-full-glory/article-19862

Tags: