ఆర్టీసీ బస్టాండ్ నుంచి రాళ్లగూడ వరకు దుర్భర పరిస్థితి.. అధికారులపై బీజేపీ ఆగ్రహం
- శంషాబాద్‌లో మురుగునీటి సమస్యపై బీజేపీ ఆందోళన.
- ఆర్టీసీ బస్టాండ్ నుంచి రాళ్లగూడ వరకు రోడ్లపై మురుగునీరు.
- ప్రజారోగ్యానికి ముప్పుగా మారిందని బీజేపీ నాయకుల ఆరోపణ.
- మురుగునీటిలో నడుస్తూ నిరసన తెలిపిన కార్యకర్తలు.
- సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక.
Ranga Reddy News: బీజేపీ నాయకులు శంషాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో నెలకొన్న మురుగునీటి సమస్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ ఆర్టీసీ బస్టాండ్ నుంచి రాళ్లగూడ వరకు గత కొన్ని నెలలుగా రోడ్లపై మురుగునీరు ఏరులై పారుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు మురుగునీటిలోనే నడుస్తూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు బాత్కు శ్రీనివాస్ మాట్లాడుతూ, రోడ్డుకు ఇరువైపులా మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన, దోమల సమస్య తీవ్రంగా పెరిగిందన్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వృద్ధులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని అన్నారు. ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే ఈ సమస్యను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.
మురుగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జనరల్ సెక్రటరీ ఎం. విజయభాస్కర్ రెడ్డి, బీజేవైఎం మున్సిపల్ అధ్యక్షుడు వంశీ యాదవ్, మహిపాల్ రెడ్డి, కె. జగజీవన్ రెడ్డి, జనార్ధన్, గోరక్ కుమార్, వినయ్ గౌడ్, కొత్త రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్థానికులు మాట్లాడుతూ, ప్రతిరోజూ మురుగునీటి మధ్యగానే రాకపోకలు సాగించాల్సి వస్తోందని, దుర్వాసనతో ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ, వెంటనే సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.