పలువురికి జయశంకర్ జాతీయ అవార్డులు
విశ్వంభర, బాగ్‌లింగంపల్లి : సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి సత్కరించడం అభినందనీయమైన విషయమని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. హైదరాబాదు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురికి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జాతీయ అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా అవార్డులు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ మాట్లాడుతూ, సమాజానికి సేవ చేస్తున్న వ్యక్తులను గుర్తించి గౌరవించడం ద్వారా మరెందరికో స్ఫూర్తి కలుగుతుందని అన్నారు. సేవా దృక్పథంతో పనిచేసే వారిని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అవార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు