విద్యార్థుల డిమాండ్లు అమలు చేయాలి: హేమా 

విద్యార్థుల డిమాండ్లు అమలు చేయాలి: హేమా 

విశ్వంభర, హైదరాబాదు : విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు అన్నారు.
హైదరాబాదులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విద్యార్థుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆమె కోరారు. భవిష్యత్తులో పేపర్ లీకేజీలు జరగకుండా పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని, పేపర్ లీకేజీ కారణంగా ప్రాణాలు కోల్పోయిన 25 మంది విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, విద్యార్థులపై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని, లాఠీచార్జికి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్రోల్‌లో ఎథనాల్ మిశ్రమం, ఇంధన ధరలు, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా వినియోగదారులకు ప్రయోజనం అందకపోవడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో పారదర్శక పాలన, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/hema-should-implement-the-demands-of-the-students/article-19826

Tags: