పేద‌ల‌కు రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ అన్నదానం

విశ్వంభర, బంజారాహిల్స్ :బంజారాహిల్స్‌లో ఉన్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద రెడీ టూ సర్వ్ ఫౌండేషన్, అమ్మ హెల్పింగ్ హాండ్స్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆస్పత్రి వద్ద చికిత్స కోసం వచ్చిన పేద రోగులు, వారి కుటుంబ సభ్యులు, అవసరమైన వారికి సుమారు 300 మందికి ఉచితంగా భోజనం పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో పలువురు స్వచ్చందంగా వాలంటీర్లుగా పాల్గొని, స్వయంగా ఆహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు, వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవలందిస్తూ వందలాది మందికి ఆహారం అందించారు. సమాజంలో ఆకలితో బాధపడుతున్న వారికి అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ఆస్పత్రుల వద్ద చికిత్స కోసం నిరీక్షించే పేద రోగులు, వారి కుటుంబ సభ్యులకు ఈ అన్నదానం ఎంతో ఉపయోగకరంగా మారిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు పెద్ది శంకర్ మాట్లాడుతూ, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలనుకునే దాతలు, స్వచ్ఛంద సేవకులు తమను సంప్రదించాలని కోరారు. సమాజ సేవలో మరింత మంది భాగస్వాములు కావడం ద్వారా అవసరమైన వారికి మరింత విస్తృతంగా సహాయం అందించగలమని ఆయన పేర్కొన్నారు.

🕒 27 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/ready-to-serve-foundation-donate-to-the-poor/article-19911

Tags: