ఆపదలో ఉన్న కుటుంబాలకు చేయూత అందించిన మబ్బు అబ్బాస్ ఫౌండేషన్
- మృతుల కుటుంబాలను పరామర్శించి బియ్యం, ఆర్థిక సాయం అందజేత
విశ్వంభర, గుండాల: గుండాల మండలంలో ఇటీవల వివిధ ఘటనల్లో కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలకు మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ చేయూతనందించింది. ఫౌండేషన్ ప్రతినిధి మబ్బు మహేష్ బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక, నైతిక భరోసా కల్పించారు. అంబాల గ్రామంలో ఇటీవల పాముకాటుకు గురై మృతి చెందిన దేశపాక అశోక్ కుటుంబాన్ని పరామర్శించిన మబ్బు మహేష్, కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారి కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇస్తూ, దశదిన కార్యక్రమం నిర్వహణ కోసం 50 కిలోల బియ్యాన్ని అందజేస్తామని ప్రకటించారు. అదే విధంగా వంగాల గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తోట్ల స్వామి యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి రూ.5,016 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మబ్బు మహేష్ మాట్లాడుతూ, గుండాల మండలంలోని అన్ని గ్రామాల్లో అవసరమైన సమయంలో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే మబ్బు అబ్బాస్ ఫౌండేషన్ లక్ష్యమన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సమాజంలో ఎవరూ కష్టకాలంలో ఒంటరిగా ఉండకూడదనే సంకల్పంతో సేవలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు. అంబాల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రణమ్మ–యాదయ్య, ఉపసర్పంచ్ బీసు ప్రశాంత్, కట్కూరి భాష, సత్తయ్య, కొమురయ్య, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. వంగాల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిప్పల్లి యాదమ్మ–నరసింహా, వార్డు సభ్యులు చిప్పలపల్లి సోమ నరసయ్య, చిప్పలపల్లి సోమన్న, రమేష్, సురేష్, ఫౌండేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.