భక్తిశ్రద్ధలతో  ఏకాదశి ఉత్సవాలు    

భక్తిశ్రద్ధలతో  ఏకాదశి ఉత్సవాలు    

విశ్వంభర, పెద్ద శంకరంపేట: ఏకాదశి ఉత్సవాలను పెద్ద శంకరంపేట మండలంలో ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని విట్టలేశ్వర దేవాలయం వేణుగోపాలస్వామి దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేద బ్రాహ్మణోత్ములు బ్రహ్మ ముహూర్తంలోని మూలవిరాట్లకు అభిషేకాలను నిర్వహించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు పెద్ద ఎత్తున ఆలయాల చేరుకొని మూలవిరాట్లకు అభిషేకాలు నిర్వహించి తమ భక్తిని చాటుకున్నారు .  తొలి ఏకాదశి హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైన ఏకాదశిలలో ఒకటి కావడంతో భక్తులు వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. శనివారం మండల కేంద్రం తో  పాటు మండలంలోని వివిధ గ్రామాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.  ఆలయాన్ని భక్తులు సందర్శించుకోవడంతో రద్దీగా మారింది. నెల్లికుదురు శ్రీ గోదా రంగనాయక స్వామి, ఇనుగుర్తి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై మూలవిరాట్ కు అభిషేకాలు,అర్చనలు,పూజలు నిర్వహించారు. భక్తులు .తొలి ఏకాదశి సందర్భంగా  విష్ణు సహస్రనామం శ్రీమద్భగవద్గీత విష్ణు అష్టోత్తర శతనామావళి, ఓం నమో నారాయణ మంత్రం వంటివి పారాయణం చేశారు. సాయంకాలం విఠలేశ్వర స్వామి ఆలయం నుండి పల్లకిలో విఠలేశ్వర స్వామి అమ్మవారి విగ్రహాలను తీసుకొని భజనలు చేస్తూపల్లకి సేవ నిర్వహించారు భక్తులు. ఉపవాస దీక్షలు పాటించారు.

🕒 26 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/draft-add-your-title/article-19767

Tags: