మెగా జాబ్ మేళా కు అపూర్వ స్పందన. -100 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన - బొల్ల శివశంకర్
ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపిన- డాక్టర్ సమత
విశ్వంభర, హైదరాబాద్ :- నారాయణగూడ పద్మశాలి భవన్, రాజ్‌మొహల్లాలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కు అపూర్వ స్పందన లభించింది. అఖిల భారత పద్మశాలి సంఘం, నేతన్న యాత్ర కమిటీ, అఖిల భారత పద్మశాలి సంఘం రాజకీయ విభాగం ఆధ్వర్యంలో బొల్ల శివశంకర్ నేతృత్వంలో, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమత ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించబడింది. ఈ జాబ్ మేళాకు సుమారు 800 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు.ఈ జాబ్ మేళాలో టెక్ మహీంద్రా, జెన్‌ప్యాక్ట్ వంటి సాఫ్ట్‌వేర్ కంపెనీలు, బ్యాంకులు, ప్రముఖ ఔషధ కంపెనీలు, నగరంలోని ప్రముఖ ఆసుపత్రులు మరియు వివిధ రంగాలకు చెందిన సుమారు 50 కంపెనీలు పాల్గొని ఉద్యోగ ఎంపికలు నిర్వహించాయి.ఈ సందర్భంగా మాట్లాడిన బొల్లా శివశంకర్ త్వరలోనే తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో, మహారాష్ట్రలో సోలాపూర్, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి పట్టణాలలో కూడా ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ జాబ్ మేళాలో సుమారు 100 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వారి తల్లితండ్రులు చాల సంతోషం తెలియజేశారు,ఈ కార్యక్రమానికి అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి, గడ్డం జగన్నాథం, గుండు ప్రభాకర్ , వానపల్లి వెంకటరావు, కొక్కుల దేవేందర్, వనం విశ్వనాథం,చిల్వేరు పురుషోత్తం,తిలక్ గారు,జైరాజు ,కటకం రాము మహిళా ప్రముఖులు వనం దుష్యంతుల ,పొరండ్ల శారద,నేతన్న యాత్ర టీమ్ సభ్యులు అరుణ పి,సంతోషి కొండబత్తిని ,అమరావతి,కీర్తన,రేఖ ,స్వప్న తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



