ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
- రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
విశ్వంభర,సూర్యాపేట: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కృష్ణానది పై వున్న ప్రాజెక్టులన్ని వేగంగా పనులు పూర్తి చేసి వచ్చే వేసవి నాటికి అందుబాటులో తేవాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం మేళ్లచెరువు మై హోమ్ గెస్ట్ హౌస్ లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో నిర్మాణంలో ఉన్న రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్, తొండపాడు లిఫ్ట్ ఇరిగేషన్, రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్, నక్కగూడెం గిఫ్ట్ ఇరిగేషన్, ముక్త్యాల బ్రాంచ్ లిఫ్ట్ ఇరిగేషన్, జాన్పాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులన్ని వచ్చే వేసవి నాటికి పూర్తిచేయాలని ,అవసరమైతే 24 గంటలు పనులు నడిచే విధంగా చూడాలని, ప్రాజెక్టు, సైడ్ కాలువలకు కావలిసిన భూసేకరణ వేగవంతం చేయాలని, భూసేకరణ పూర్తయిన వాటికి వెంటనే డబ్బులు చెల్లించడం జరుగుతుందని, ప్రాజెక్టులపై ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్లు కట్టాలో అక్కడ వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు. ఎస్సారెస్పీ ఫేస్ -2 క్రింద ఉన్న ఆయకట్టు, ఎన్ఎస్పీ కింద ఉన్న పొలాలకు వారాబంది ప్రకారం నీటి సరఫరా చేయాలని, ఒక ఎకరం కూడ ఎండిపోకూడదని రాష్ట్ర చరిత్రలో నాగార్జునసాగర్ పోయిన వర్షాకాలం సీజన్లో మూడుసార్లు నిండినదని, పోయిన వర్షాకాలం సీజన్లో రాష్ట్రంలో అత్యధికంగా వరి పండినదని, వరికి అత్యధిక మద్దతు ధర చెల్లించి చరిత్ర సృష్టించామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ కే నరసింహ, ఇరిగేషన్ శాఖ ఎస్సీ, హుజూర్నగర్ ఆర్డిఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు



