విశ్వంభర క్యాలెండర్ ఆవిష్కరణ.
On
విశ్వంభర, ఎల్బీనగర్ : విశ్వంబర దినపత్రిక క్యాలెండర్, డైరీ ని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను వెలికి తీసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి విశ్వంబర దినపత్రిక కృషి చేయాలని సూచించారు. పార్టీలకతీతంగా పత్రిక లో వార్తలు ప్రచురితమైనప్పుడే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉద్యమకారుల కన్వీనర్ న్యాలకొండ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు పెంబర్తి శ్రీనివాస్, బాబు, చండేశ్వర్ , విశ్వంభర దినపత్రిక జనరల్ మేనేజర్ శ్రీకాకుళ రాజు తదితరులు పాల్గొన్నారు.