రోడ్డు పై దుమ్ము లేవకుండా చర్యలు
On
విశ్వంభర, ఇనుగుర్తి: మండలం లోని పెద్దతండ (సీఎం)లో వేసవి దృష్ట్యా రోడ్డుపై దుమ్ము ధూళి విపరీతంగా లేస్తోంది.ప్రయాణికులు ,ప్రజల బాధలను గమనించిన గ్రామ సర్పంచి బానోతు రేణుక నరేష్ వెంటనే స్పందించి రోడ్డుపై ఇరువైపులా ట్రాక్టర్ ట్యాంకర్ తో జి పి సిబ్బంది ద్వారా నీరు చెల్లించారు.. దీంతో ఎంతో ఉపశమనం కలుగుతోందని, సర్పంచి తీసుకుంటున్న చర్యల పట్ల తండావాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు సర్పంచి అధ్యక్షతన స్థానిక గ్రామపంచాయతీలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాలక మండలి తో పాటు తండావాసులు పాల్గొన్నారు.



