కొత్తగూడెంలో  రైతు సంఘం మహాసభలు

కొత్తగూడెంలో  రైతు సంఘం మహాసభలు

విశ్వంభర, అశోక్ నగర్: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభలు ఈ నెల 23, 24, 25 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్ రావు, టి సాగర్ తెలిపారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో పోస్టర్ ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ, రైతాంగ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకు ఈ మహాసభలు వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. మహాసభల్లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రుణమాఫీ, పోడు భూముల హక్కులు, సాగునీటి ప్రాజెక్టులు, కౌలు రైతుల గుర్తింపు వంటి అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. ముగింపు రోజున నూతన కమిటీ ఎన్నికతో పాటు రాబోయే ఉద్యమాలకు రూపకల్పన చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సారంపల్లి మల్లారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహరెడ్డి, పి జంగారెడ్డి, అరిబండి ప్రసాదరావు, వర్ణ వెంకట్ రెడ్డి, మూడ్ శోభన్, లెల్లెల బాలకృష్ణ, బొంతు రాంబాబు, మాటూరి బాలరాజు గౌడ్, ఈసంపెల్లి బాబు, ఎం శ్రీనివాసులు, పల్లపు వెంకటేష్, రాపర్తి సోమయ్య, వాసిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags: