మాదిగ హక్కుల దండోరా పోస్టర్ ఆవిష్కరణ 

మాదిగ హక్కుల దండోరా పోస్టర్ ఆవిష్కరణ 

విశ్వంభర, అంబర్‌పేట : మాదిగ హక్కుల దండోరా ఆరవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించనున్న సమావేశాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ మాదిగ పిలుపు మేరకు మాదిగ హక్కుల దండోరా పోస్టర్‌ను డాక్టర్ ఆర్‌.ఎస్‌. ప్రసన్న కుమార్ గురువారం అంబర్‌పేట లో ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్‌.ఎస్‌. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 27న మధ్యాహ్నం 1 గంటకు బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరగనున్న సమావేశానికి అంబర్‌పేట నుంచి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ వెంకట రమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చల్లగుండ్ల శ్రీనివాస్‌రావు, గోల్డ్ శ్రీనివాస్, బోయ వెంకట రమణ మాదిగ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రేణుక మాదిగ, మనోజ్ మాదిగ, దేవానంద్, కె. రమేష్ నాయక్, చిట్టెల యాదగిరి మాదిగ, భాను ప్రసాద్, రంజిత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు

Tags: