సూర్యాపేటలో కేంద్ర బృందం పర్యటన 

సూర్యాపేటలో కేంద్ర బృందం పర్యటన 

 విశ్వంభర, సూర్యాపేట: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మారుస్తున్న తరుణంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి సంస్థ  కేంద్ర బృందం సభ్యులు సంజయ్ కుమార్  నేతృత్వంలోఈ నెల 26 నుండి 28 వరకు సూర్యాపేట జిల్లాలో పర్యటన సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో సమావేశమయ్యారు. ఈ  సమావేశంలో సూర్యాపేట జిల్లాలో జరిగిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం  పనుల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బృంద సభ్యులకు వివరించారు. అనంతరం ఈజీఎస్ పథకాల పనులపై  జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శనను కేంద్ర బృందం, కలెక్టర్ తిలకించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, డిప్యూటీ సీఈవో శిరీష, కేంద్ర బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags: