ఇదేమి దౌర్జన్యం.. అచ్చంపేట ఘటనపై మండిపడిన కేటీఆర్! 

ఇదేమి దౌర్జన్యం.. అచ్చంపేట ఘటనపై మండిపడిన కేటీఆర్! 

లోక్ సభ ఎన్నికలలో చోటు చేసుకున్నటువంటి ఘటనలో భాగంగా అచ్చం పేటలో జరిగిన దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనని ఉద్దేశిస్తూ కేటీఆర్ రాహుల్ గాంధీకి ట్వీట్ చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఈ దాడి గురించి రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ.. యాహీ హై క్యా ఆప్కీ మొహబ్బత్ కీ దుకాన్ అంటూ ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీని ట్యాగ్ చేశారు.

 

Read More పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ ఉదారత

ఇలా అచ్చంపేట ఘటనకు పాల్పడినటువంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఈయన తెలంగాణ రాష్ట్ర డీజీపీ కోరారు. ఇలా ప్రతిపక్ష నేతలపై జరుగుతున్నటువంటి దాడిలో భాగంగా పోలీసులు కూడా భాగం కావటం నిజంగా సిగ్గుచేటు అంటూ ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read More పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ తడక రమేష్ ఉదారత

ఈ దాడికి పాల్పడిన గుండాలను ఇలా దాడి జరుగుతున్న అక్కడే ఉండి ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసుల పట్ల కూడా తగిన చర్యలు తీసుకోవాలి అంటూ కేటీఆర్ కోరారు. వీరిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే మానవ హక్కుల కమిషన్ ను సంప్రదించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయంటూ కేటీఆర్ తెలిపారు.