ఎల్లమ్మ బజార్ రోడ్ వెడల్పు తగ్గించాలి

ఎల్లమ్మ బజార్ రోడ్ వెడల్పు తగ్గించాలి

విశ్వంభర, హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ బజార్ రోడ్డును 70 అడుగుల వరకు విస్తరించేందుకు మున్సిపల్ అధికారులు చేపట్టిన మార్కింగ్‌ను నిలిపివేసి, రోడ్డు వెడల్పును తగ్గించాలని కోరుతూ కాలనీవాసులు శనివారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు అయిలేని మల్లికార్జున రెడ్డి, బీఎస్పీ నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణ పేరుతో పేద ప్రజలు తమ నివాసాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే రోడ్డును 100 అడుగుల వరకు విస్తరించాలని అధికారులు మార్కింగ్ చేయగా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినా, రోడ్డు వెడల్పుపై స్పష్టమైన నిర్ణయం వెలువడలేదన్నారు.ప్రస్తుతం సుమారు 40 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డులో 22 అడుగుల బీటీ రోడ్డు ఉండగా, వాహనాల రద్దీ కూడా పెద్దగా లేదన్నారు. మరోవైపు రామవరం వైపు బైపాస్ రోడ్డు ప్రతిపాదన ఉన్న నేపథ్యంలో ఈ రోడ్డును 70 అడుగులకు విస్తరించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.హుస్నాబాద్ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చివేసే నిర్ణయాలను అంగీకరించబోమన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రోడ్డు విస్తరణ ప్రణాళికను పునఃపరిశీలించి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.వినతిపత్రం సమర్పించిన వారిలో భూక్యా లక్ష్మన్ నాయక్, మార్క శ్రీనివాస్, పెరుమాండ్ల శ్రీనివాస్, లక్ష్మిరాజిరెడ్డి, మొండయ్యతో పాటు పలువురు కాలనీవాసులు పాల్గొన్నారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-width-of-ellamma-bazar-road-should-be-reduced/article-18925

Tags: