అలరించిన తెలంగాణ వైభవ నృత్య రూపకం 

అలరించిన తెలంగాణ వైభవ నృత్య రూపకం 

విశ్వంభర, చిక్కడపల్లి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వైభవాన్ని కూచిపూడి నృత్య రూపంలో ఆవిష్కరించిన చిన్నారుల ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హైదరాబాదులోని చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో శ్రీ జ్ఞాన సరస్వతి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'తెలంగాణ వైభవం' నృత్య రూపకం ఆహూతుల ప్రశంసలు అందుకుంది. హైదరాబాదు చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో శ్రీ జ్ఞాన సరస్వతి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 'తెలంగాణ వైభవం' కూచిపూడి నృత్య రూపకం ప్రేక్షకులను అలరించింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జిల్లాల వైభవాన్ని ప్రతిబింబిస్తూ చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు సభికుల ప్రశంసలు అందుకున్నాయి. ముఖ్య అతిథి అంజనా చౌదరి మాట్లాడుతూ, కళలు భారతీయ సంస్కృతిని భావితరాలకు చేరవేసే గొప్ప సాధనమని అన్నారు. గురువు వాణి రమణ శిక్షణలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభ అభినందనీయమని పేర్కొంటూ, వారు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని శుభాకాంక్షలు తెలిపారు.అకాడమీ కార్యదర్శి వాణి రమణ మాట్లాడుతూ, విద్యార్థుల్లో కళాప్రతిభతో పాటు సాంస్కృతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అతిథులు, అకాడమీ చిన్నారులు తల్లిదండ్రులు, కళాభిమానులు పాల్గొన్నారు.

🕒 07 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/telanganas-glorious-dance-form-entertained/article-18099

Tags: