నిరుపేద విద్యార్థులకు రెడ్డి జాగృతి చేయూత

విశ్వంభర, రామన్నపేట:  ప్రతిభ ఉన్న ప్రతి రెడ్డి కుల విద్యార్థికి తమ ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డంకి కాకూడదని రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెఒగారి మాధవరెడ్డి అన్నారు. విద్య ద్వారా కుటుంబాల అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతిభావంతులకు సమాన అవకాశాలు కల్పించడం దేశ ప్రగతికి అవసరమని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌లో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఫీజులు చెల్లించలేని ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి కుటుంబాల విద్యార్థులకు డిగ్రీ మూడు సంవత్సరాల ఫీజులో సగం మొత్తాన్ని రెడ్డి జాగృతి భరిస్తుందని ప్రకటించారు. అలాగే విద్యతో పాటు ఉపాధికి అవసరమైన నైపుణ్యాలు, ప్లేస్‌మెంట్ అవకాశాల కల్పనకు కూడా సహకరిస్తామని పేర్కొన్నారు. మన పిల్లలను విద్యతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యతను, సాంకేతికతను నేర్పి ఒక పరిపూర్ణ విద్యార్థిగా, సమర్ధుడిగా తీర్చిదిద్దడంలో చేయి తిరిగిన  ఒక అత్యున్నత విద్యాసంస్థలో చదివిద్దామని పిలుపునిచ్చారు. రెడ్డి జాగృతి ఆధ్వర్యంలో సగభాగం ఫీజు కట్టడానికి ఎంపీసి విద్యార్థులతో పాటు బైపీసీ విద్యార్థులు అర్హులని చెప్పారు. ఇందుకు సంబందిచిన వివరాల కోసం మొబైల్ నంబర్.9533099999, వాట్సప్ నంబర్: 9290906777 సంప్రదించాలని తెలిపారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/reddy-wakes-up-poor-students/article-18003

Tags: