ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తాం
విశ్వంభర, మహబూబాబాద్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఓటరికి అవకాశం కల్పిస్తామని మహబూబాబాద్ తహసీల్దార్ కట్టం చంద్ర రాజేశ్వరరావు తెలిపారు.ఆదివారం మహబూబాబాద్ పట్టణంలోని కంబాలపల్లి గ్రామంలో బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఎస్‌ఐఆర్ ఫారాలు పంపిణీ చేస్తున్న విధానాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్లకు ఫారాలు అందజేయడంతో పాటు ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించాలని బీఎల్‌వోలకు సూచించారు. ఓటర్ల నుంచి అందిన దరఖాస్తులను గడువులోగా స్వీకరించి, నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పక్కా ప్రణాళికతో ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, రాజకీయ పార్టీలతో సమావేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.