కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి

విశ్వంభర, సైదాపూర్: నేడు నిర్వహించనున్న కరీంనగర్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని సైదాపూర్ మండలంలోని ప్రతి గ్రామం నుంచి  భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సైదాపూర్ మండల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు రాధారపు సంపత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధులను కార్మికుల సంక్షేమానికే వినియోగించాలని, పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న ఈ కలెక్టరేట్ ముట్టడిలో ప్రతి గ్రామం నుంచి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

🕒 19 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-siege-of-karimnagar-collectorate-should-be-successful/article-18939

Tags: