నమ్మకాన్ని నిలబెట్టుకుంటా :శ్రీనివాస రెడ్డి

విశ్వంభర, అనంతగిరి: కాంగ్రెస్ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అనంతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముసుకు శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ తనను రెండోసారి తన పై విశ్వాసం ఉంచి మండల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతను అప్పగించిన నీటిపారుదల  పౌర సరఫరాల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి  ,కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి  సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు  గుడిపాటి నర్సయ్య కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. నాపై ఉంచిన ఈ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత బాధ్యతతో, అంకితభావంతో పనిచేస్తాను అన్నారు. అనంతగిరి మండలంలోని అన్ని గ్రామ శాఖల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులందరినీ కలుపుకొని ఐక్యంగా ముందుకు సాగుతూ, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి,మండల పార్టీ ప్రజల కోసం నిరంతరం పనిచేయడానికి కృషి చేస్తాననీ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన పార్టీ నాయకత్వానికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మండల ప్రజల అందరి సహకారం, ఆశీర్వాదాలతో అనంతగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీ విజయానికి నా వంతు కృషిని నిరంతరం కొనసాగిస్తానని అన్నారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/srinivasa-reddy-keeps-faith/article-18038

Tags: