అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి: ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

విశ్వంభర, పరిగి: పరిగి పట్టణంలోని అయ్యప్ప కాలనీలో శ్రీ ధర్మశాస్త అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి, సతీమణి ఉమా రామ్మోహన్ రెడ్డితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దేవాలయాల నిర్మాణం, పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. 19 ఏళ్లుగా నిలిచిపోయిన ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఆలయ వ్యవస్థాపకులు పాలాది శ్రీనివాస్ గుప్తాతో పాటు దాతలు, కమిటీ సభ్యుల సేవలను అభినందించారు. అనంతరం భక్తులకు అన్నదానం వడ్డించి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-rammohan-reddy-said-all-the-people-should-be-happy/article-18050

Tags: