కార్టూన్ ద్వారా ఉపాధ్యాయుని నిరసన
విశ్వంభర, రామన్నపేట: టీచర్లకు మధ్యాహ్న భోజనం, బ్రేక్ ఫాస్ట్ అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజల్లో విద్యార్థుల్లో చులకన అవుతున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాల్వంచ హరికిషన్ తన కార్టూన్ ద్వారా ప్రభుత్వానికి తెలుపుతూ తన ఆవేదనను, నిరసనను వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం కావాలని టీచర్లు ఎవ్వరూ ఆడగ లేదని, అడిగినవి పీఅర్సీ, డీఏలు మాత్రమేనని, అవి ఇవ్వకుండా మాకు అవసరం లేని మధ్యాహ్న భోజనం బ్రేక్ ఫాస్ట్ ఇవ్వడమేంటని పాల్వంచ హరికిషన్ అన్నారు. ఉపాధ్యాయులను ప్రజల్లో చులకన చేసే నిర్ణయాలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజల్లో, విద్యార్థుల్లో చులకన అయ్యే విధంగా ఉందని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. పేద విద్యార్థులకు అందించే భోజనం నాణ్యమైనదిగా అందిస్తే చాలని, అందుకోసం కావలసిన చర్యలు చేపట్టాలని, ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇవ్వవలసిన 6 పెండింగ్ డీఏలను, పీఅర్సీ సత్వరమే అందించాలని, దయచేసి ప్రజల్లో ఉపాధ్యాయులను చులకన చేయొద్దని, అది వ్యవస్థకు మంచిది కాదని ప్రభుత్వానికి సూచించారు.