ఆర్మూర్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

విశ్వంభర, ఆర్మూర్: కాలం మారినా, జీవితంలో ఎంతటి ఉన్నత స్థానాలకు చేరినా కాలేజీ రోజుల నాటి స్నేహం ఎప్పటికీ మరువలేనిదని నిరూపించారు ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన 2003-2006 బ్యాచ్ విద్యార్థులు. చదువు పూర్తి చేసుకుని సరిగ్గా 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఒకే వేదికపైకి చేరి సందడి చేశారు. ఆదివారం ఆర్మూర్ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ 'ఆత్మీయ కలయిక' కార్యక్రమం ఎంతో భావోద్వేగాల మధ్య, అత్యంత ఉత్సాహంగా సాగింది. డిగ్రీ పూర్తి చేసి విడిపోయిన తర్వాత, రెండు దశాబ్దాల పాటు ఒకరికొకరు దూరమైన 2003-2006 బ్యాచ్ మిత్రులు మళ్లీ కలుసుకోవడంతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం నెలకొంది. ఇరవై ఏళ్ల కాలంలో వచ్చిన మార్పులను గమనిస్తూ, ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఆత్మీయంగా పలుకరించుకున్నారు. దేశ, విదేశాల్లో వివిధ ఉన్నత రంగాలలో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా తమ ప్రస్తుత హోదాలను పక్కనబెట్టి, మళ్లీ ఆనాటి కాలేజీ విద్యార్థులుగా మారిపోయారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక జ్ఞాపకాల వేదికపై నాటి మిత్రులు తమ కాలేజీ రోజులను నెమరువేసుకున్నారు. ఆర్మూర్ కాలేజీ క్లాస్‌రూమ్ ముచ్చట్లు, స్నేహితులతో కలిసి తిరిగిన ప్రదేశాలు,వారి జ్ఞాపకాలతో హాల్‌ను నవ్వులతో నింపేశారు. ఆనాటి లెక్చరర్ల బోధనా శైలిని, వారు చెప్పిన మంచి మాటలను ఈ సందర్భంగా గౌరవంగా స్మరించుకున్నారు.

🕒 06 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/armor-degree-college-is-a-friendly-community-of-students/article-18042

Tags: