పందిళ్ల బ్రిడ్జి వద్ద హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలి

  • అయిలేని మల్లికార్జున్ రెడ్డి

విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ నుంచి సిద్దిపేట వెళ్లే మార్గంలో ఉన్న పందిళ్ల బ్రిడ్జి వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు తక్షణమే హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని తెలంగాణ రైతు రక్షణ సమితి హుస్నాబాద్ డివిజన్ అధ్యక్షులు అయిలేని మల్లికార్జున రెడ్డి ప్రభుత్వ అధికారులను కోరారు. గత నెల రోజుల్లోనే పందిళ్ల బ్రిడ్జి పరిసర ప్రాంతంలో నాలుగు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని, వాటిలో ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మించినప్పటికీ, బ్రిడ్జి పొడవు మరింత పెంచి నిర్మించి ఉంటే వాహనదారులకు సౌకర్యవంతంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. అలాగే, కొత్త జాతీయ రహదారి పాత రోడ్డుతో పోలిస్తే ఎత్తులో ఉండటంతో వాహనదారులు బ్రిడ్జి వద్దకు చేరుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అయితే అక్కడ ప్రమాద సూచికలు, హెచ్చరిక బోర్డులు లేదా వేగ నియంత్రణ సూచనలు లేకపోవడం వల్ల ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందన్నారు.కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పందిళ్ల బ్రిడ్జి వద్ద అవసరమైన రోడ్డు భద్రతా సూచికలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అయిలేని మల్లికార్జున రెడ్డి విజ్ఞప్తి చేశారు.

🕒 10 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/warning-signs-should-be-installed-at-canopy-bridge/article-16430

Tags: