మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
On
విశ్వంభర, మహబూబాబాద్ : మూడు రోజుల క్రింద అనారోగ్యంతో స్వర్గస్తులైన మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన 26వ వార్డు బ్యాంకు కాలనీలోని తోట శివకుమార్ కుటుంబానికి సభ్యులకు 52కేజీల బియ్యం మానుకోట మున్నూరుకాపు పటేల్స్ అసోసియేషన్అ అందజేశారు. అధ్యక్షులు మాట్లాడుతూ ఆ కుటుంబానికి మున్నూరు కాపు సంఘం తరఫున ఎల్లవేళలా ఏ ఆపద వచ్చిన అన్ని విధాల ఆదుకుంటామని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు శంతన్ రామరాజు, పిట్టల శ్రీకాంత్, ఆవుల కుమార్, పిట్టల చంద్రశేఖర్, శిరంశెట్టి సురేందర్, బోళ్ల జగ్గయ్య, కడుదుల కృష్ణ, కూన వేణు తదితరులు పాల్గొన్నారు.



