రైతు భరోసా యాత్ర కాదు బిజెపి నాయకుల ఉనికి గోస యాత్ర 

  •  ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

 విశ్వంభర, కుల్కచర్ల: బీజేపీ నాయకులు తమ రాజకీయ ఉనికి కోసం బస్సు యాత్రలు చేస్తూ రైతులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. బీజేపీ నాయకులు కుల్కచర్ల మార్కెట్ లో ధాన్యం కొనుగోళ్లు పరిశీలనకు వచ్చి ప్రభుత్వం పై చేసిన విమర్శలకు మార్కెట్ కమిటీ ఆవరణలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొని మార్కెట్ యార్డ్‌కు వచ్చిన వరి ధాన్యాన్ని పరిశీలించి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం విధించిన 52 లక్షల మెట్రిక్ టన్నుల పరిమితిని తొలగించి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రధాని మోదీతో హామీ ఇప్పించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో రైతులు ఎంత వరి పండించినా కొనుగోలు చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు. ఇప్పటికే 75 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసి రూ.847 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు.రైతులకు వరిపై రూ.500 బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం.గతంలో లేని విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. పరిగి ప్రాంత అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు భూసేకరణకు రూ.587 కోట్ల నిధులు మంత్రి మండలి మంజూరు చేసింది అని గుర్తు చేశారు.దాదాపు 3000 ఎకరాల భూసేకరణ చేపట్టి కృష్ణా నది, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ సాగునీటి కోసం పోరాడింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  రైతుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు.ఏకకాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి రైతు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇవే కాకుండా ఉచిత బస్సు, రైతు భరోసా, ఉచిత విద్యుత్, లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి, మండల పిఎసిఎస్ చైర్మన్ మొగులయ్య,  మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ నాయక్, చౌడపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేఖర్, కాంగ్రెస్ నాయకులు వెంకటయ్య, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

🕒 26 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-presence-of-bjp-leaders-is-not-a-farmer-assurance/article-15867

Tags: