చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి.
- ఉపేంద్ర మాదిగ, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్
On
విశ్వంభర, సరూర్ నగర్ :- మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సరూర్నగర్ తాసిల్దార్ కార్యాలయములో దళితుల ఆత్మగౌరవ నిరసన కార్యక్రమనికి ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ బత్తిన సుధాకర్ మాదిగ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్చార్జి రాగల ఉపేంద్ర మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి పై బూటు విసిరి దాడికి పాల్పడ్డ అడ్వకేట్ రాకేష్ కిషోర్ ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. సుధాకర్ మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి దళితుడు కాబట్టి కొన్ని జీర్ణించుకోలేని అగ్రవర్గాల శక్తులు దాడి చేయించారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకురాలు విద్యావతి, వేణు గౌడ్, ఎమ్మార్పీఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గం కార్యదర్శి డి ప్రకాష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ డివిజన్ ఇన్చార్జీలు రాజు మాదిగ, చంపాపేట్ శేఖర్ మాదిగ కొత్తపేట డివిజన్, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, సురేష్ మాదిగ, విజయ మాదిగ , నర్సింగరావు, పరశురాం మాదిగ, చంటి మాదిగ, మౌలాలి మాదిగ, ఎలియ మాదిగ, రంగన్న మాదిగ, దేవా మాదిగ, రవి మాదిగ, సంతోషి మాదిగ, సుమన్ మాదిగ, సురేష్ మాదిగ, యాదయ్య మాదిగ, సునీల్ మాదిగ, మంద రవి, మంద సృజన్ మాదిగ, చెన్నయ్య మాదిగ, చంద్రశేఖర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.



