అమరవీరులకు బీఎస్పీ ఘన నివాళి
విశ్వంభర, సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి అమరవీరుల స్తూపానికి బీఎస్పీ జిల్లా కమిటీ సభ్యులు మంగళవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి, జిల్లా నాయకులు మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఉద్యమంలో విద్యార్థులు, యువకులు, ప్రజలు చేసిన పోరాటాలు రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేశాయన్నారు. అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, ప్రజా సంక్షేమం సాధించే దిశగా ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి సాధించేలా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేశ్, ఉపాధ్యక్షుడు ఈర్ల మల్లేశం ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి నరేశ్, నాయకులు నాగరాజు, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినోద్ చారి, సిద్దిపేట అసెంబ్లీ అధ్యక్షుడు సంపత్, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షుడు కొమ్ము చంద్రం, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, కనకప్రసాద్, లింగం, ప్రశాంత్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిటిజన్ ఫోరం జిల్లా కోఆర్డినేటర్ శంతన్ రామరాజుతో పాటు జైలు సిబ్బంది ,మహ్మద్ ఖళీల్, చాంద్ పాషా, మోటపోతుల వీరన్న, చీర వెంకన్న, రామాంజనేయులు, శ్రీనివాస్, ఎన్. సురేష్, శ్రీరాములు, స్వరూప విచారణ ఖైదీలు , తదితరులు పాల్గొన్నారు