ఉద్యమకారుల ఆత్మబలిదానాల ఫలితమే తెలంగాణ
విశ్వంభర, చిక్కడపల్లి : ముషీరాబాదు నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారుడు సిరిగిరి శ్యామ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాదు ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, మాజీ కార్పొరేటర్ వి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేడు తెలంగాణ రాష్ట్రం వందలాది ఉద్యమకారుల ఆత్మబలిదానాల ఫలితంగా ఏర్పడిందని తెలిపారు. కె. చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సాగిన ఉద్యమంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కల్వ గోపి, రాకం సత్యనారాయణ, వెంకటేష్, అమిత్ రావు, అరుణ్, విక్కి అరవింద్, రమేష్, జుగేందర్ తదితరులు పాల్గొన్నారు.