ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ బీమా

ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ బీమా

  • - ఉద్యమ కవులు, కళాకారులు, జర్నలిస్టులను గుర్తిస్తాం 
    - రైతులు సన్నబియ్యం, ఆయిల్‌ఫామ్ సాగుకు మొగ్గుచూపాలి
    - రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

విశ్వంభర, సిద్దిపేట: ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడిన తరువాత కాంగ్రెస్ మూడు ప్రత్యేక కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణలోని ప్రతీ పౌరుడికి ఇందిరమ్మ జీవిత బీమా పథకం తీసుకొచ్చామని, ప్రతీ కుటుంబానికి అండగా ఉండేలా కార్యక్రమాన్ని అమలుచేస్తామని చెప్పారు. రూ.2లక్షల పింఛన్ల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించామని,
ఉద్యమకారులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులకు గౌరవాన్ని, గుర్తింపు ఇచ్చేలా కమిటీ ఏర్పాటుచేసి గుర్తిస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యమంలో కేసులు, దాడులతో నష్టపోయిన వారిని గుర్తించి తగిన న్యాయం చేస్తామని చెప్పారు. ప్రజాపాలన ప్రభుత్వంలో మొదటిదశ ఒక్కో నియోజకవర్గంలో 3500ఇందిరమ్మ ఇండ్లు నిర్మించామని, రెండో దశలో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్‌లో ప్రారంభించారని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, వ్యవసాయ అధికారులు, రైతులతో సమావేశం త్వరలోనే ఏర్పాటుచేస్తామని చెప్పారు. జిల్లాలో ఏడాదికి లక్షా 50వేల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం అవసరమని, కానీ 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే పండుతుందన్నారు. రైతులు సన్నబియ్యం పండించేలా విత్తనాల నుంచే అవగాహన కల్పిస్తామని,
ప్రతీ రైతు ఆయిల్‌ఫామ్ సాగు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, నర్మెటలో ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభమైందని గుర్తుచేశారు. ప్రతీ ఉద్యోగి మొక్కలు నాటేలా గ్రామగ్రామన ప్రణాళికలు రూపొందించామని, హుస్నాబాద్‌లో ప్లాంటేషన్‌పై ఐదుగురు సభ్యులతో కమిటీ వేసినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి కమిటీలు వేసేలా ఆలోచన చేస్తున్నామన్నారు. 3లక్షల ఈత చెట్లు సిద్ధంగా ఉన్నాయని, కాలువల గట్లు, ప్రభుత్వ స్థలాల్లో నాటడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య పెంచేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటామని, స్కూల్స్ ప్రారంభమయ్యే జూన్ 12తేదీనే అవసరమైన కిట్లు అందిస్తామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ పాడైపోయిన వాహనాలు ఏర్పాటు చేస్తామని, అవసరమైతే గత ప్రమాదాల్లో మరణించిన వారి ఫొటోలు పెడతామన్నారు. ఆర్టీసీలో రోజుకు 65లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని, 35లక్షల కిలోమీటర్లు బస్సులు ప్రయాణం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ చేస్తామని, త్వరలోనే నోటిఫికేషన్లు వస్తాయని వెల్లడించారు.

🕒 03 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/indiramma-insurance-for-everyone/article-16159

Tags: