తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలి   - ప్రొ కోదండరాం

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలి   - ప్రొ కోదండరాం

విశ్వంభర, హైదరాబాద్ :- నాడు సీమాంధ్ర దోపిడీ పాలనకు వ్యతిరేకంగా వివిధ రంగాల్లో వివిధ రూపాల్లో పోరాటం చేసినటువంటి ఉద్యమకారులంతా సంఘటితంగా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు పోరాడుతామని తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈరోజు తెలంగాణ జన సమితి కార్యాలయంలో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు తెలంగాణ రాష్ట్రం కొరకు వివిధ జేఏసీలుగా, సంఘాలుగా ఏర్పడి సంఘటితమై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అదే స్పూర్తితో ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు, ఉద్యమకారుల సంక్షేమం కొరకు అందరం సమిష్టిగా కలిసికట్టుగా నిలబడదామని ఆయన పిలుపునిచ్చారు. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి చంద్రకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎన్నో త్యాగాలతో కూడుకున్నదని ఉద్యమకారులు ఎంతో నిజాయితీగా పోరాడి సాధించుకున్నారని, ఆకాంక్షల భిన్నంగా గత పది సంవత్సరాల పాలన సాగిందని, ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా ప్రజాస్వామికంగా పాలన కొనసాగించి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఉద్యమ సంఘాల జేఏసీలు, ఉద్యమకారుల సంక్షేమ సంఘాలు, 69 ఉద్యమకారుల ఫోరం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. అనంతరం సమావేశం మూడు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది.
తీర్మానాలు:
1. సీమాంధ్ర వలస పాలనకు, దోపిడికి వ్యతిరేకంగా దశాబ్దాల పాటు ఎన్నో పోరాటాలతో, త్యాగాలతో, ఆత్మ బలిదానాలతో సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది ఏ ఒక్కరో సాధించిన విజయం కాదు. ప్రజలందరూ సమిష్టిగా సకలజనులమేకమై సాధించిన ఈ రాష్ట్రం ఏ ఒక్కరి ప్రయోజనాల కోసమే కాకుండా ఉద్యమ ఆకాంక్షలతో కూడిన రాష్ట్రంగా నిర్మాణం జరగాలని ఆ వైపుగా తెలంగాణ ఉద్యమకారులంతా కలిసికట్టుగా పనిచేస్తాం.
2. తెలంగాణ రాష్ట్ర సాధన ఎన్నో త్యాగాలతో కష్టనష్టాలను ఎదుర్కొని ఉద్యమకారులందరూ కలిసి సాధించినటువంటిది. స్వరాష్ట్రంలో గత పది సంవత్సరాల కాలంలో తొలి తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులకు కనీస గౌరవం ఇవ్వ. ఉద్యమకారుల సంక్షేమం గూర్చి పట్టించుకోలేదు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులకు సమోన్నత గౌరవం కల్పిస్తామని ఉద్యమకారుల సంక్షేమానికి పూనుకుంటామని, ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియకు పూనుకొని ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం 
3. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కొరకు ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో సమన్వయంతో కలిసి పని చేస్తాం.
 
తెలంగాణ జన సమితి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నరసయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సమావేశంలో సిపిఐ.ఎం.ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే గోవర్ధన్, అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ రాజేందర్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్, ఉద్యోగ జేఏసీ నాయకులు ఎం.బి కృష్ణ యాదవ్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ ప్రపుల్ రామ్ రెడ్డి, వివిధ ఉద్యమకారుల సంఘాల నేతలు తెలంగాణ వెంకన్న, రమాదేవి, రామగిరి ప్రకాష్, శ్యాంసుందర్ గౌడ్, అంజిరెడ్డి, కుమారస్వామి, రామ్మూర్తి,గొల్లపల్లి నాగరాజు, ఆర్టీసీ జేఏసీ లాలయ్య, మల్లయ్య, 1969 ఉద్యమకారులు తిప్పన సిద్దులు, నలమాస స్వామి, రాజేంద్ర బాబు. తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శులు దర్మార్జున్, పల్లె వినయ్, పార్టీ నాయకులు ఆర్ లక్ష్మి, తుల్జారెడ్డి ఆశప్ప, నిజ్జన రమేష్, హనుమంత్ రెడ్డి, సలీమ్ పాషా, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
 

Tags: