ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారితో జాగ్రత్త.  

  • -సీపీ

విశ్వంభర, నిజామాబాద్ జిల్లా :-ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి పట్ల జాగ్రత్తలు పాటించాలని నిజామాబాద్​ సీపీ సాయిచైతన్య సూచించారు. ఈ మేరకు శనివారం సీపీ ప్రకటన విడుదల చేశారు.ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి పట్ల జాగ్రత్తలు పాటించాలని సీపీ సాయిచైతన్య  సూచించారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాలు లేదా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వారి పట్ల ఇంటి ఓనర్లు, దుకాణాల యజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మేరకు శనివారం సీపీ  ప్రకటన విడుదల చేశారు.
వారి పూర్తివివరాలు తెలుసుకున్నాకే..ఉపాధి కోసం వచ్చే వ్యక్తుల పేరు, శాశ్వత చిరునామా, ఆధార్ కార్డు ప్రతులు, మొబైల్ నంబర్లు, కుటుంబ వివరాలు, పనిచేసే స్థలం, వచ్చిన తేదీ వంటి పూర్తివివరాలు తీసుకున్నాకే వారిని పనిలో పెట్టుకోవాలని సీపీ  సూచించారు. అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌లో కూడా వారి వివరాలు నమోదు చేయించాలని తెలిపారు. అద్దె ఇళ్లలో నివసించే వారు, నిర్మాణ పనుల్లో పనిచేసే కార్మికులు, హోటళ్లు, లాడ్జీలు, పరిశ్రమలు ఇతర వ్యాపార సంస్థల్లో పనిచేసే వారి వివరాలను యాజమాన్యాలు నిరంతరం పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, వారి ప్రవర్తనలో మార్పులు గమనించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం తెలిసినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల అప్రమత్తతతోనే నేరాలను అరికట్టడం, శాంతిభద్రతలను కాపాడడం సులభమవుతుందని తెలిపారు. ప్రతిఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించి సమాజ భద్రతకు తోడ్పడాలన్నారు.

🕒 10 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/beware-of-those-who-come-from-other-places-for-employment/article-15230

Tags: