భద్రాద్రి సన్నిధిలో నిజాయితీకి నిదర్శనం

భద్రాద్రి సన్నిధిలో నిజాయితీకి నిదర్శనం

  • పోగొట్టుకున్న రూ.3.50 లక్షల విలువైన బంగారు బ్రాస్లెట్‌ను భక్తునికి అప్పగించిన దేవస్థానం అధికారులు

విశ్వంభర, భద్రాచలం:-  భక్తుల ప్రశంసలు అందుకున్న వెంకటేశ్వర్లు, జి. వెంకటేశ్వరరావు భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో మరోసారి మానవత్వం, విశ్వాసం, నిజాయితీ ప్రతిఫలించింది. దర్శనార్థం వచ్చిన ఓ భక్తుడు పోగొట్టుకున్న లక్షల రూపాయల విలువైన బంగారు బ్రాస్లెట్‌ను మరో భక్తుడు నిజాయితీగా దేవస్థానం అధికారులకు అప్పగించగా, అధికారులు దానిని అసలు యజమానికి క్షేమంగా అందజేశారు. ఈ ఘటన ఆలయ పరిసరాల్లో భక్తుల ప్రశంసలు అందుకోవడంతో పాటు “భద్రాద్రి క్షేత్ర మహిమ ఇదే” అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.శనివారం రాజమండ్రి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దర్శనానికి వచ్చిన వీర బ్రహ్మానంద స్వామి అనే భక్తుడు ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకుంటున్న సమయంలో తన చేతికి ధరించిన బంగారు బ్రాస్లెట్‌ను అనుకోకుండా పోగొట్టుకున్నారు. దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత చేతికి ఉన్న బ్రాస్లెట్ కనిపించకపోవడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.దీంతో ఆయన దేవస్థానం అధికారులను సంప్రదించి జరిగిన విషయాన్ని వివరించారు. బ్రాస్లెట్ ప్రత్యేక ఆకృతిలో ఉండటంతో పాటు దాని విలువ సుమారు రూ.3.50 లక్షలు ఉంటుందని తెలిపారు. విలువైన ఆభరణం పోగొట్టుకోవడంతో వీర బ్రహ్మానంద స్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇదే సమయంలో కొత్తగూడెంకు చెందిన వెంకటేశ్వర్లు అనే భక్తుడికి ఆలయ ప్రాంగణంలో బంగారు బ్రాస్లెట్ కనిపించింది. ఆభరణం విలువైనదని గుర్తించిన ఆయన ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా వెంటనే భద్రాచలం కు చెందిన జి. వెంకటేశ్వరరావు సహకారంతో దేవస్థానం అధికారులను సంప్రదించారు. అనంతరం ఆ బంగారు బ్రాస్లెట్‌ను అధికారులకు అప్పగించారు. వారి నిజాయితీని అక్కడున్న భక్తులు అభినందించారు.

🕒 10 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/evidence-of-honesty-in-bhadradris-presence/article-15218

Tags: